కాకతీయ, సినిమా డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబు మరదలు, బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ కు ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును బస్సు ఢీకొట్టింది. దీంతో ఘటనపై తన ఆగ్రహం వ్యక్తం చేస్తూ బస్సు రవాణా సంస్థపై విమర్శలు చేశారు. శిల్పా శిరోద్కర్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఈ ఘటనకు సంబంధించిన పోస్టు చేశారు. ఈ రోజు నా కారును సిటీ ఫ్లో అనే కంపెనీకి చెందిన బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనకు సంబంధించి సంస్థకు చెందిన యోగే్స కదమ్, విలాస్ మంకోటే అనే ప్రతినిధులను సంప్రదించాము.
అది తమ కంపెనీ బాధ్యత కాదని..డ్రైవర్ దే పూర్తి బాధ్యత అని చెప్పారు. వీళ్లు తమ కంపెనీ ఉద్యోగుల పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. డ్రైవర్ నెలకు ఎంత సంపాదిస్తాడు. అతను ఈ డ్రామేజ్ ఎలా కడతాడు అంటూ శిల్పా అసంత్రుప్తిని వ్యక్తం చేశారు. దేవుడి దయ వల్ల నా సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనపై ఫిర్యాదు తీసుకునేందుకు సహకరించిన ముంబై పోలీసులకు ధన్యవాదాలు తెలిపార. కానీ కంపెనీ మాత్రం ఎలాంటి బాధ్యతను తీసుకునేందుకు నిరాకరిస్తుందని శిల్పా పోస్టులో రాసుకొచ్చారు.


