ష్… గప్ చుప్.. ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం
భద్రాద్రి జిల్లాలో 143సర్పంచ్,1298 వార్డులకు 14న పోలింగ్
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : రాష్ట్రవ్యాప్తంగా మూడు విడుదల గా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు రెండో విడత ప్రచార ఘట్టం శుక్రవారంతో ముగిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఏడు మండలాల్లో జరుగుతున్న రెండో విడత ఎన్నికల్లో 173 సర్పంచ్ స్థానాలకు 1298 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో రెండో విడతలో156 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఏకగ్రీవమైన 12 స్థానాలను మినహాయింపు లభించింది. దీంతో మిగతా 143 సర్పంచ్ స్థానాలకు, 1298 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా 1298 పోలింగ్ స్టేషన్లలో 14 వెబ్ కాస్టింగ్ సెంటర్లు, 06 మైక్రో అబ్జర్వ్ సెంటర్లను ఏర్పాటు చేశారు.


