కాకతీయ, నర్సింహులపేట : గొర్రెలు మేపడానికి వెళ్లి ఊదరి యాదగిరి (64) మృతిచెందిన సంఘటన నర్సింహులపేట శివారు పామాయిల్ తోటలో బుధవారం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలికి వెళ్లి చూడగా శరీరంపై విద్యుత్ షాక్ తగిలినట్లు కాలిన గాయాలతో చనిపోయి ఉండడాన్ని గమనించినట్లు తెలిపారు. ఈ మేరకు మృతుడి కుమారుడు ఉదరి అనిల్ కరెంట్ షాక్ తగిలి చనిపోయినట్లు అనుమానం ఉన్నదని ఫిర్యాదు చేసినట్లు ఎస్సై సురేష్ తెలిపారు. అనిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.


