కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న తోకల శైలుకిరణ్ తన కృషి, పట్టుదలతో జీవితంలో మరో మైలురాయిని అధిగమించారు. తాజాగా విడుదలైన గ్రూప్–2 ఫలితాల్లో డిప్యూటీ ఎంఆర్ఓగా ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో ఆమె నియామక పత్రం అందుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నియామకం పొందారు. భవిష్యత్తులో భర్త తోకల బాలరాజు సహకారంతో ప్రజలకు మరింత సేవ చేసేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు.
కానిస్టేబుల్ నుంచి డిప్యూటీ ఎంఆర్ఓగా శైలు కిరణ్
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


