మమ్మద్ గౌస్ పల్లి సర్పంచ్ అభ్యర్థిగా శైలజ నామినేషన్
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మల్లంపల్లి మండలం మమ్మద్ గౌస్ పల్లి గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థిగా సోమవారం గోల్కొండ శైలజ సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. మమ్మద్ గౌస్ పల్లి గ్రామం నుంచి నామినేషన్ వేసేందుకు పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీగా మల్లంపల్లి కి చేరుకొని నామినేషన్ పత్రాలు సమర్పించారు. గతంలో మమ్మద్ గౌస్ పల్లి గ్రామానికి సర్పంచ్ గా పనిచేసిన అనుభవంతో పాటు ప్రజల మద్దతుతో నామినేసన్ దాఖలు చేసినట్లు శైలజ వెల్లడించారు. గతంలో తాము గ్రామంలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామంలో సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్న నాయకురాలిగా తననీ సర్పంచ్ గా గ్రామ ప్రజలు మరల ఎన్నుకుంటారనే నమ్మకం ఉందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు తోడు మంత్రి సీతక్క ఆశీస్సులతో సర్పంచ్ గా విజయం సాధిస్తానని శైలజ ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మేకల ప్రశాంత్, గ్రామ అధ్యక్షులు ఉప్పు మొగిలి, గ్రామ కమిటీ సభ్యులు కుమారస్వామి, రాజ్ కుమార్, రాజేందర్, బాలకృష్ణ, రాజు, జలీల్ , గ్రామస్తులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


