కాకతీయ, కరీంనగర్ : జిల్లాకేంద్రానికి సమీపంలోని కొత్తపల్లి అల్ఫోర్స్ ఇ–టెక్నో స్కూల్‌లో ఎస్జీఎఫ్ అండర్–17 జిల్లా స్థాయి బాలబాలికల చెస్ ఎంపిక పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. చెస్ క్రీడ మేథస్సును పదునుపరచి విజయానికి దారి చూపుతుందన్నారు. ఈ ఆట సృజనాత్మకతను, ఓపికను పెంపొందిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు. కార్యక్రమంలో ఎస్ జీ ఎఫ్ జిల్లా కార్యదర్శి వేణుగోపాల్, పి ఈ టీల సంఘం మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, జీనియస్ అకాడమీ నిర్వాహకులు కొంకటి అనుప్, తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీలలో గెలిచిన ఐదుగురు క్రీడాకారులు గురువారం జగిత్యాలలో జరిగే జోనల్ స్థాయి పోటీలకు అర్హత సాధించనున్నారు.
అల్ఫోర్స్’ లో ఎస్ జీఎఫ్ అండర్–17 చెస్ పోటీలు ప్రారంభం
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


