కాకతీయ, మహబూబాబాద్ టౌన్: రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని కోరుతూ మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ విద్యార్ది సంఘం నాయకులు ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించి, కలెక్టరేట్ ఆఫీస్ ముందు బైఠాయించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గంధసిరి జ్యోతి బసు, పట్ల మధు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్య పట్ల అలసత్వం వహించడంతో అనేకమంది పేద విద్యార్థులు మధ్యలోనే డ్రాప్ అవుట్, అవుతున్నారని, ఆవేదన వ్యక్తం చేశారు పేద విద్యార్థి చదువుల కోసం ప్రభుత్వం నుండి ప్రతి ఏటా స్కాలర్షిప్ బిల్లులు పెండింగ్ లేకుండా చూసుకోవాలని కోరారు. విద్యార్థుల పెండింగు బిల్లులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సింహాద్రి, జిల్లా నాయకులు ఎండి అమీర్ ,ఉదయ్, వీరేందర్, శృతి, అజీజ్ ,వంశీ, సమీర్, యాకన్న మహేష్ తదితరులు పాల్గొన్నారు


