కాకతీయ, కరీంనగర్ : పట్టణంలోని 33వ డివిజన్ భగత్ నగర్ కాలనీ వాసులు త్రాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులకు ఒకసారి మాత్రమే నీరు వస్తుండగా, ఆ నీరు కూడా సరిపడకపోవడంతో ప్రజలు నల్లాల వద్ద గంటల కొద్ది క్యూలలో నిలబడుతున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు కూడా ఉదయం నీటి కోసం లైన్లలో నిలబడ వలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా సరైన నీటి సౌకర్యం అందించాలని పలుమార్లు అధికారులను సంప్రదించినా తమకు నీటి సమస్య తప్పడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. నీటి సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని కాలనీవాసులు హెచ్చరించారు.


