కాంగ్రెస్ పార్టీ నుండి పలువురి సస్పెన్షన్
కాకతీయ, చెన్నారావుపేట : పదహారు చింతల తండ గ్రామనికి చెందిన కాంగ్రెస్ నాయకుల నిర్ణయం మేరకు ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు సిద్దన రమేష్ సూచనల మేరకు పలువురిని సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు బానోత్ రమేష్ నాయక్ తెలిపారు. గ్రామంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసినందుకు నలుగురిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వీరికి కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. బానోత్ సుక్య,గుగులోత్ నంద, గుగులోత్ శ్రీను, బానోత్ హరిలాల్ లను సస్పెండ్ చేస్తున్నట్లు గ్రామ కాంగ్రెస్ అద్యక్షుడు తాజా ఉప సర్పంచ్ బాణోత్ రమేష్ నాయక్ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బానోత్ విక్రమ్, ధన్సింగ్, జేత్యనాయక్,శంకర్, కిషన్, శ్రీను, కేశ్య,రాంజీ, బధ్రు, చందు, బాలు, ఈర్య, నర్సు, సుమన్,శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


