epaper
Sunday, March 1, 2026
epaper

మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ‌

మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ‌
పీఎల్‌జీఏ బెటాలియన్ కమాండర్ దేవా, కీల‌క నేత రాజిరెడ్డి లొంగుబాటు
వారితో పాటు మొత్తం 20 మంది డీజీపీ ఎదుట స‌రెండ‌ర్‌
48 ఆయుధాలు, 2,206 రౌండ్ల అమోనియం స్వాధీనం
మిగ‌తా మావోయిస్టులు సైతం జ‌నంలోకి రావాలి
తెలంగాణ డీజీపీ శివ‌ధ‌ర్‌రెడ్డి పిలుపు

కాకతీయ, తెలంగాణ బ్యూరో : సీపీఐ (మావోయిస్టు) సంస్థకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టుల చివరి ప్రధాన కోటగా భావించిన పీఎల్‌జీఏ బెటాలియన్ పూర్తిగా కూలిపోయింది. పీఎల్‌జీఏ బెటాలియన్ కమాండర్ **బడ్సే సుక్కా అలియాస్ దేవా (డీకే ఎస్‌జెడ్‌సీఎం)తో పాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ కీలక నేత కంకణాల రాజిరెడ్డి అలియాస్‌ వెంకటేష్ (ఎస్‌సీఎం) సహా మొత్తం 20 మంది అండర్‌గ్రౌండ్ మావోయిస్టు కేడర్లు, 48 ఆయుధాలు, 2,206 రౌండ్ల అమ్యూనిషన్‌తో తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ లొంగుబాటుతో తెలంగాణ స్టేట్ కమిటీ పూర్తిగా క్షీణించినట్లు పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం టీఎస్‌సీలో ఒక్క స్టేట్ కమిటీ మెంబర్ మాత్రమే మిగిలి ఉన్నట్లు వెల్లడించారు. లొంగిపోయిన కేడర్లు పీఎల్‌జీఏకి చెందిన ఆయుధ గోదాముల వివరాలను పోలీసులకు అందజేశారు. ఈ సందర్భంగా
2 ఎల్‌ఎంజీలు, 8 ఏకే–47 రైఫిళ్లు, 10 ఇన్సాస్ రైఫిళ్లు, 8 ఎస్‌ఎల్‌ఆర్‌లు, ఒక యూఎస్ మేడ్ కోల్ట్ రైఫిల్, ఒక ఇజ్రాయెల్ మేడ్ టావర్ రైఫిల్, 4 బీజీఎల్‌లు, 2 గ్రెనేడ్లు సహా మొత్తం 48 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా రూ.20.30 లక్షల నగదును కూడా సీజ్ చేశారు.

దాడుల వ్యూహ‌క‌ర్త‌.. బడ్సే దేవా
బడ్సే సుక్కా అలియాస్‌ దేవా సీపీఐ (మావోయిస్టు)లో రెండో అత్యంత కీలక గిరిజన నేతగా గుర్తింపు పొందాడు. జెరాం ఘాటి దాడి సహా అనేక ఘాతుకాలకు వ్యూహకర్తగా వ్యవహరించిన ఇతనిపై తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాలు, ఎన్ఐఏ కలిసి రూ.75 లక్షల రివార్డు ప్రకటించాయి. 2025 అక్టోబర్ 21న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చేసిన శాంతి పిలుపుకు స్పందిస్తూ మావోయిస్టులు హింసా మార్గాన్ని విడిచి ప్రజాజీవనంలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు లొంగుబాటు సమయంలో తెలిపారు. అంతర్గత విభేదాలు, భద్రతా బలగాల నిరంతర ఒత్తిడి, లాజిస్టిక్ నెట్‌వర్క్ క్షీణత, కుటుంబాల నుంచి దూరం కావడం వంటి కారణాలతో ఉద్యమంపై నమ్మకం కోల్పోయినట్లు పేర్కొన్నారు. లొంగిపోయిన 20 మందికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పునరావాస విధానం ప్రకారం మొత్తం రూ.1.81 కోట్ల ఆర్థిక సహాయం అందించనున్నారు. తాత్కాలికంగా ఒక్కొక్కరికి రూ.25,000 చొప్పున వెంటనే అందజేశారు.
ఈ చారిత్రక లొంగుబాటుకు కృషి చేసిన భద్రతా బలగాలను తెలంగాణ డీజీపీ శివ‌ధ‌ర్‌రెడ్డి ప్ర‌శంసించారు. ఇంకా అండర్‌గ్రౌండ్‌లో ఉన్న మావోయిస్టులు ఆయుధాలు వీడి శాంతి మార్గాన్ని ఎంచుకోవాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img