బొల్లికుంట హాస్టల్స్‌లో వరుస చోరీలు
కాకతీయ, ఖిలా వరంగల్ : ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట ప్రాంతంలో ప్రైవేట్ హాస్టల్స్‌లో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. తెల్లవారుజామున సమయంలో ఓ యువకుడు హాస్టల్స్‌లోకి చొరబడి మూడు హాస్టల్స్‌లో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో మొత్తం 6 మొబైల్స్, 3 ల్యాప్‌టాప్స్ అపహరించబడినట్లు సమాచారం. దొంగతనం సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ కావడంతో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఇటీవల కాలంలో హాస్టల్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి చోరీలు పెరుగుతుండటంతో విద్యార్థుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


