మెట్‌పల్లిలో సంచలనం
తక్కువ సీట్లతోనే కాంగ్రెస్‌కు చైర్మన్ పీఠం
నలుగురు ఇండిపెండెంట్లు..
బీజేపీకి చెందిన ఒక సభ్యుడు మద్దతు
మున్సిపల్ చైర్మన్‌గా లింబాద్రి
వైస్ చైర్మన్‌గా ఓంకారి నవీన్
కాకతీయ, జగిత్యాల: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మున్సిపాలిటీలో అనూహ్య రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. మొత్తం 26 వార్డులు ఉన్న మున్సిపాలిటీలో కేవలం 6 సీట్లు మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ… వ్యూహాత్మక సమీకరణాలతో మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడం స్థానిక రాజకీయాల్లో భారీ చర్చకు దారితీసింది. సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ స్వతంత్ర కౌన్సిలర్లు నలుగురు, బీజేపీకి చెందిన ఒక సభ్యుడు మద్దతు తెలపడంతో కాంగ్రెస్ అభ్యర్థి మైలారపు లింబాద్రి మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి పార్టీల అంచనాలను తారుమారు చేస్తూ జరిగిన ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సమయంలో వైస్ ఛైర్మన్‌గా ఓంకారి నవీన్ ఎన్నికయ్యారు. కొత్త పాలకవర్గం ఏర్పాటుతో మెట్పల్లి మున్సిపాలిటీ పరిపాలనలో కొత్త దశ ప్రారంభమైంది. ఎన్నికల ఫలితాలు స్థానిక రాజకీయాల్లో శక్తి సమీకరణాల మార్పును స్పష్టంగా ప్రతిబింబించగా మద్దతు రాజకీయాలు మున్సిపల్ పాలనలో నిర్ణాయకంగా మారిన పరిణామంగా ఈ సంఘటన నిలిచింది.


