అనారోగ్యంతో కాంగ్రెస్ సీనియర్ నేత దేవేందర్ మృతి…
కాకతీయ,గీసుకొండ : అనారోగ్య కారణాలతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మృతి.మండలంలోని మనుగొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు సరికిటి దేవేందర్ గత కొన్ని సంవత్సరాల నుండి అనారోగ్యంతో బాధపడుతూ శనివారం ఉదయం మృతి చెందారు.గతంలో దేవేందర్ మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా,మాలమహా నాడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా తన సేవలు అందించారు.దేవేందర్ మరణంతో మనుగొండ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.పలు పార్టీల నాయకులు ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.


