ప్రభుత్వ పాఠశాల్లో స్వయం పరిపాలన దినోత్సవం
కాకతీయ, పెద్దవంగర : మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్
పాఠశాలలో శనివారం ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా నటించి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఏ గా పానుగోత్ అఖిల్, జిల్లా విద్యాధికారిగా మాణిశ్వర్, మండల విద్యాశాఖాధికారిగా ప్రసన్న కుమార్, ప్రిన్సిపాల్‌గా అశ్విత,ఉపాధ్యాయులుగా యశ్వంత్ (తెలుగు),అనుజ్ఞ(ఇంగ్లీష్),ప్రసన్న(గణితం),హేమంత్,శాన్వి(డ్రాయింగ్ ) అభినంద్ (పిఇటి) వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ సత్య చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.అనంతరం గత వారం టిజీ సెట్ 5వ తరగతి ప్రవేశ ఫలితల్లో అయిదుగురికి అయిదుగురు సెలెక్ట్ అవ్వగా వారికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.


