మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులు స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు చెప్పడంతో పాటు,డీఈవో,ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులుగా పాఠశాలకు రావడం పలువురిని ఆకట్టుకుంది. విద్యార్థులే ఉపాధ్యాయులుగా చక్కటి పాఠలను బోధించారు. ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.


