ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవంను ఘనంగా జరుపుకున్నారు.విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు.డీఈవో, ప్రధానోపాధ్యాయుడు గా వచ్చి వారి విధులను నిర్వహించారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. ఈకార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంఈఓ రామ్మోహన్ రావు, పడమటిగూడెం ప్రధానోపాధ్యాయుడు ఎర్ర పూర్ణచందర్ మరియు ఉపాధ్యాయులు,గ్రామప్రజలు పాల్గొన్నారు.


