మల్లంపల్లికి సీతక్క ఒక కల్పవృక్షం
మల్లంపల్లి మండల సాధన సమితి అధ్యక్షుడు గోల్కొండ రాజు
కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా మల్లంపల్లి మండల అభివృద్ధికి మంత్రి సీతక్క చేసిన కృషి అపారమని, సీతక్క ఈ ప్రాంతానికి ‘కల్పవృక్షం’ అని మల్లంపల్లి మండల సాధన సమితి అధ్యక్షుడు గోల్కొండ రాజు అన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ల్యాద శ్యామారావు ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు సమావేశాలు పెట్టి సీతక్క ని విమర్శించడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేసే నాటకం మాత్రమే అన్నారు. మల్లంపల్లి మండలం పట్ల బీఆర్‌ఎస్‌కు నిజమైన చిత్తశుద్ధి ఉన్నట్లయితే పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు ఈ మండలాన్ని ఏర్పాటు చేయలేకపోయారా?” అని ప్రశ్నించారు.
దివంగత నేత కుసుమ జగదీష్ మండల ఏర్పాటుకోసం పోరాడి మానసిక వేదనకు గురయ్యారని గుర్తుచేశారు. మల్లంపల్లి మండల సాధన సమితి, సబంధ వర్గాల జేఏసీ పోరాటం తీవ్రతను బట్టే బీఆర్‌ఎస్ ప్రభుత్వం చివరికి ఎన్నికల ముందు గెజిట్ విడుదల చేసిందని రాజు అన్నారు. మందు నుండి మేము చేస్తున్న ఉద్యమనికి వెన్నుదన్నుగా నిలిచి, శాసనసభలో జీరో అవర్‌లో కూడా మల్లంపల్లి మండల సమస్యలను ప్రస్తావించిన నాయకురాలు సీతక్క మాత్రమే అని అన్నారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ల్యాద శ్యామారావు మాట్లాడుతూ మల్లంపల్లిలో 2 కోట్లు సీసీ రోడ్ల నిర్మాణానికి,1.50 కోట్లు కొత్త MPDO కార్యాలయ నిర్మాణానికి,త్వరలో శాశ్వత పోలీస్ స్టేషన్ నిర్మాణం,పాటు మరెన్నో అభివృద్ధి పనులకు కోట్ల రూపాయలు విడుదల చేయనున్నట్లు సీతక్క హామీ ఇచ్చారని తెలిపారు. మల్లంపల్లి మండల అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌కు లేదని శ్యామారావు తీవ్రంగా విమర్శించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ చెరుకుపల్లి శ్రీకాంత్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు వనమా వేణు, చిట్టిరెడ్డి రామ్‌రెడ్డి, వనమ శ్రీనివాస్, మూల గణేశ్ రెడ్డి, కాగితోజు దేవేందర్, గొర్రె కుమార్, నాగుల శ్రీకాంత్, క్లాసిక్ రవి, తాళ్లపెళ్లి సాంబయ్య, అంగరి మహేష్ తదితరులు పాల్గొన్నారు.


