కాకతీయ పెద్దపల్లి: రామగుండం నగరపాలక పరిధిలో గోవుల కు ఎలాంటి రక్షణ లేకుండా నిర్వీర్యమైన పరిస్థితులతో ప్రజలు చలించిపోతున్నారు. నగరంలో రోడ్లపై సరైన ఆరోగ్య రక్షణ లేకుండా గోవులు తీవ్ర రోగాల బారిన పడి ఇప్పటికే పదుల సంఖ్యలో గోవులు మృతి చెందాయని భారతీయ స్వదేశీ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు శీలం శ్రీనివాస్ ముదిరాజ్ ఆరోపించారు.
నగరంలో రోడ్లపై అన్యాక్రాంతంగా గోవులు విగతాజీవులై తీవ్ర అనారోగ్య పాలై ఉంటున్నాయని వెటర్నటి అధికారులు వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నా పట్టించుకోవడంలేదన్నారు. మున్సిపల్ అధికారులు కూడా గోవుల ఆరోగ్యం రక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సంబంధిత బంజరు దొడ్డికి తరలించాలని గో సంరక్షక కమిటీ వారు కూడా స్పందించాలని వెంటనే అధికారులు చర్యలు చేపట్టి గోవులను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిమాండ్ చేశారు.


