- ఏవో భూక్య మహేందర్ నాయక్
కాకతీయ, ఇనుగుర్తి: యాసంగి సీజన్లో రైతులకు అందుబాటులో విత్తనాలు, అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉంచుకోవాలని ఫర్టిలైజర్ ఆగ్రో ఏజెన్సీ యజమానులకు ఏవో భూక్య మహేందర్ నాయక్ సూచించారు. మండలంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో బుధవారం ఎరువుల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి సీజన్ ఆరంభమవుతుండటంతో కొరత లేకుండా సహకరించాలన్నారు. క్రయవిక్రయాల్లో రైతులకు తప్పనిసరి బిల్లు ఇవ్వడమే కాకుండా రైతు సంతకం సైతం తీసుకోవాలన్నారు. ఎప్పడికప్పుడు స్టాక్ రిజిష్టర్, ఈ పాస్ మిషన్ లో పొందుపర్చాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎరువుల షాప్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.


