ప్రశాంతంగా రెండో విడత పోలింగ్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓటింగ్ 82.9 శాతం
కాకతీయ, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా పూర్తయ్యాయి. 19 మండలాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం వరకు ఉత్సాహంగా కొనసాగింది. ఓటింగ్ శాతం 82.9 శాతం చేరి, తొలి దశలో నమోదైన 79.77 శాతం కంటే పెరుగింది. కరీంనగర్ జిల్లా కలెక్టర్ & ఎన్నికల అధికారి పమేలా సత్పతి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, రాజన్న సిరిసిల్ల ఇంచార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ తదితరులు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం డ్రోన్ల ద్వారా, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీలు మరియు రామగుండం పోలీస్ కమిషనర్ ప్రత్యక్ష పర్యవేక్షించారు.
జిల్లాల వారీ పోలింగ్ శాతం:
కరీంనగర్: 86.58% (పురుషులు: 87.44%, మహిళలు: 85.77%)
పెద్దపల్లి: 84.15% (పురుషులు: 84.60%, మహిళలు: 83.72%)
జగిత్యాల: 78.34% (పురుషులు: 71.25%, మహిళలు: 84.79%)
రాజన్న సిరిసిల్ల: 84.41% (పురుషులు: 82.77%, మహిళలు: 85.96%)


