కాకతీయ, ములుగు ప్రతినిధి: మారకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా వెంకటాపూర్ మండలంలో పోలీసు విభాగం విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. నల్లకుంట ప్రాంతంలోని వివిధ కిరాణ షాపులు, అలాగే మండలం మీదుగా వెళ్తున్న వాహనాలను నార్కోటిక్ డాగ్ సహాయంతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో వెంకటాపూర్ ఎస్సై, పోలీసు సిబ్బందితో పాటు జిల్లా డాగ్ స్క్వాడ్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై చల్ల రాజు మాట్లాడుతూ మండలంలో ఎవరైనా మారకద్రవ్యాల రవాణా లేదా వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటువంటి వ్యక్తుల గురించి సమాచారం అందించిన వారికి గోప్యతా, భద్రత కల్పిస్తామని తెలిపారు.


