కాకతీయ, సంగెం: విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత పెంపొందించేందుకు సైన్స్ ఫెయిర్‌లు ఎంతో దోహదపడతాయని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ వసుధ అన్నారు. సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామంలోని నోట్రె డామ్ స్కూళ్లో తరుణి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సోమవారం సైన్స్ ఫెయిర్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా తరుణి ప్రాజెక్ట్ సంగెం మండలం కో ఆర్డినేటర్ రణధీర్ మాట్లాడుతూ ‘‘ప్రతి సంవత్సరం మేము ఇలాంటి సైన్స్ ఫెయిర్‌లను నిర్వహిస్తూ విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీస్తుమన్నారు.
ఈ పరీక్ష కోసం తిమ్మాపురం ప్రభుత్వ పాఠశాల సైన్స్ టీచర్ రవళి వచ్చారు. ఆమె మాట్లాడుతూ “సైన్స్ అంటే పుస్తకాల్లో ఉండే పాఠం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న ప్రతి అంశం కూడా సైన్స్‌నే. ఆ దృక్పథంతో విద్యార్థులు నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 400 మంది విద్యార్థులు పాల్గొని 164 ప్రాజెక్టులను ప్రదర్శించారు. ప్రధాన అతిథిగా హాజరైన వసుధ విద్యార్థులు రూపొందించిన ప్రయోగాలను వీక్షించి వారిని అభినందించారు. కార్యక్రమంలో తరుణి టీమ్, పాఠశాల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


