సావిత్రిబాయి పూలే ఆలోచనలు మార్గదర్శకం
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్‌లో విగ్రహావిష్కరణ
కాకతీయ, నిజామాబాద్ : నిజామాబాద్ పట్టణంలో శ్రీమతి సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా విద్య, సామాజిక సమానత్వం కోసం సావిత్రిబాయి పూలే చేసిన సేవలు దేశానికి చిరస్మరణీయమని అన్నారు. ఆమె ఆలోచనలు నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు, స్థానిక ఎమ్మెల్యే ధనపాల్ సూర్య, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్‌బిన్, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, బీసీ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


