epaper
Wednesday, March 25, 2026
epaper

ఖిల్లాను కాపాడండి… కబ్జాలు ఆపండి..!

ఖిల్లాను కాపాడండి… కబ్జాలు ఆపండి..!
క‌రీంన‌గ‌ర్‌ కలెక్టర్‌కు మొలంగూర్ వాసుల‌ వినతి
గ్రామానికి రావాల్సిందిగ వినూత్నంగా ఆహ్వాన ప‌త్రిక‌
చారిత్రాత్మక ఖిల్లా అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అభ్య‌ర్థ‌న‌
పర్యాటక కేంద్రంగా మార్చాలని ప్రతిపాదన
కలెక్టర్ స్పందనపై గ్రామస్తుల ఆశలు

కాకతీయ, శంకరపట్నం : చారిత్రక ప్రాధాన్యత కలిగిన మొలంగూర్ ఖిల్లా అభివృద్ధి, గ్రామ భూసమస్యల పరిష్కారం కోసం గ్రామస్తులు మరోసారి కదిలారు. మండలంలోని మొలంగూర్ గ్రామానికి చెందిన ప్రజలు, తెలంగాణ జన సమితి నాయకులు కలిసి జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రకు ఆహ్వాన పత్రిక అందజేసి గ్రామ సమస్యలను వినిపించారు. ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, గ్రామంలో పెరుగుతున్న భూకబ్జాలను అరికట్టాలని ప్రధానంగా కోరారు. తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు మోరే గణేష్, అధికార ప్రతినిధి భాను బాబు మాట్లాడుతూ మొలంగూర్ ఖిల్లా చారిత్రక, సాంస్కృతిక సంపదతో నిండిన కట్టడమని వివరించారు. ఖిల్లాలో హిందూ, ముస్లిం ప్రార్థనా మందిరాలు, కోనేరులు, దూద్ బావి, అఖండ దీపం, దుర్గా ఫిరంగులు వంటి అనేక విశేషాలు ఉన్నాయని, ఇవి పర్యాటకులను ఆకర్షించే సామర్థ్యం కలిగినవని తెలిపారు. సరైన ప్రణాళికతో అభివృద్ధి చేస్తే మొలంగూర్ రాష్ట్ర స్థాయి పర్యాటక కేంద్రంగా ఎదిగే అవకాశముందని పేర్కొన్నారు.

ఖిల్లా మార్గంలో భూమి కబ్జా…

ఖిల్లాకు వెళ్లే మార్గంలో ఉన్న సుమారు రెండు ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమి అక్రమంగా ఆక్రమించబడిందని గ్రామస్తులు ఆరోపించారు. ఈ భూమిని కాపాడి ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలన్నారు. ముఖ్యంగా గ్రామానికి అవసరమైన కార్యాలయాలు, గ్రంథాలయాల నిర్మాణానికి ఈ భూమిని ఉపయోగించాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే సర్వే నంబర్ 703లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన ప్రభుత్వ భూములు కూడా ప్రమాదంలో ఉన్నాయని, వాటిని రక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. గతంలో కలెక్టర్ పమేలా సత్పతి జోక్యంతో కొంత భూమిని రక్షించగలిగామని గుర్తు చేస్తూ, ఇప్పటికీ అదే స్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరారు.

మిగులు భూములపై కన్నేసిన కబ్జాదారులు..!

మొలంగూర్ నుంచి వేరుపడి కొత్త గ్రామపంచాయతీగా ఏర్పడిన నల్ల వెంకయ్యపల్లి గ్రామానికి సంబంధించి సర్వే నంబర్లు 753, 754, 755లో ఉన్న ప్రభుత్వ భూములను అభివృద్ధి అవసరాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా సర్వే నంబర్ 661లో ఉన్న 15 ఎకరాల భూమిలో కొంత భాగం ఇప్పటికే కేటాయించబడినప్పటికీ, మిగిలిన భూమి కబ్జాకు గురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలోని చెరువులు, కుంటలు కూడా ఆక్రమణలకు గురవుతున్నాయని పేర్కొంటూ, ఇది భవిష్యత్తులో నీటి సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు. భూసంరక్షణపై తక్షణ చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత విషమిస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కలెక్టర్లు సరఫరాజ్ అహ్మద్, పోలీస్ కమిషనర్ కమలహాసన్, శశాంక్ మహంతి వంటి ఉన్నతాధికారులను ఆహ్వానించి ఖిల్లా పరిస్థితిని చూపించినప్పటికీ, అభివృద్ధి పనులు ముందుకు సాగలేదని వారు గుర్తు చేశారు. అధికారులు పర్యటనలకే పరిమితమై, స్థిరమైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత కలెక్టర్ చిత్ర మిశ్ర స్వయంగా గ్రామాన్ని సందర్శించి సమస్యలను పరిశీలించాలని, ఖిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని కోరారు. అలాగే ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పెండింగ్ కేసుల‌పై ఫోక‌స్ పెట్టాలి

పెండింగ్ కేసుల‌పై ఫోక‌స్ పెట్టాలి నేర సమీక్షలో సీపీ ఆదేశాలు కాకతీయ, కరీంనగర్ :...

వైద్యం పేరుతో దోపిడీ

వైద్యం పేరుతో దోపిడీ పెద్ద ఆస్ప‌త్రుల‌తో గ్రామీణ వైద్యుల లింకు చిన్న వైద్యానికి పెద్ద...

123 కోతులు పట్టివేత.. అటవీ ప్రాంతాలకు తరలింపు

123 కోతులు పట్టివేత.. అటవీ ప్రాంతాలకు తరలింపు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్...

నాలాలోనే “జనతా బార్”

నాలాలోనే “జనతా బార్” పట్టణం మధ్యలో బహిరంగ కబ్జా..! కాలువ మాయం… అధికారుల మౌనం ప్రభుత్వ...

జిల్లాలో సమృద్ధిగా ఇంధన నిల్వలు

జిల్లాలో సమృద్ధిగా ఇంధన నిల్వలు అనవసర కొనుగోళ్లు చేయొద్దు కలెక్టర్ కోయ శ్రీ...

రోడ్డు ప్రమాదంలో రైతు మృతి

రోడ్డు ప్రమాదంలో రైతు మృతి హిట్ అండ్ రన్ కేసు నమోదు కాకతీయ, కరీంనగర్...

శ్రీరాముడు ధర్మానికి ప్రతీక

శ్రీరాముడు ధర్మానికి ప్రతీక విలువలతో ముందుకు సాగాలి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి....

మున్సిపల్ కార్మికులకు గాయాలు

మున్సిపల్ కార్మికులకు గాయాలు విధులు నిర్వ‌హిస్తుండ‌గా క‌రెంట్ షాక్‌ కాకతీయ, కరీంనగర్ : విధి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img