epaper
Monday, December 1, 2025
epaper

మ‌నుషుల్లో దేవుడు స‌త్య సాయిబాబా

మ‌నుషుల్లో దేవుడు స‌త్య సాయిబాబా

తన సేవలతో దైవంగా కీర్తించ‌బ‌డుతున్నారు
ప్రభుత్వాలతో పోటీ పడి ఉచితంగా విద్య, వైద్యం అందించారు
ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో బాబా ట్రస్ట్ సేవలు
తెలంగాణలోనూ అధికారికంగా ఉత్సవాలు నిర్వ‌హిస్తాం..
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుక‌ల్లో సీఎం రేవంత్‌రెడ్డి

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భగవాన్ శ్రీసత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశించామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. భగవాన్ సత్యసాయి బాబా శతజయంతి కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప గౌరవం.. అరుదైన అవకాశం అన్నారు. ఆయన మన మధ్య లేకపోయినా వారి స్ఫూర్తి మనందరిలో ఉంది.. మీ అందరిలో కనిపిస్తోంది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బాబా సేవలను విస్తృతం చేసేందుకు ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుంద‌ని రేవంత్ రెడ్డి వెల్లడించారు. సత్యసాయి జిల్లా భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ మంత్రులతోపాటు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తొలుత భగవాన్ శ్రీసత్యసాయి మహా సమాధిని దర్శించుకుని నివాళులు అర్పించారు. అనంతరం వేడుకలకు హాజరై సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా సత్యసాయి బాబా ప్రవచనాలైన సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసా థీమ్‌లతో చిన్నారుల నాట్యం అందర్నీ ఆకట్టుకుంది. అనంత‌రం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారు… ప్రేమతో మనుషులను గెలిచాడు అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

ఆయ‌న స్ఫూర్తి మ‌నంద‌రిలో ఉంది

భగవాన్ శ్రీసత్యసాయి బాబా శతజయంతి సందర్భంగా అందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ శతజయంతి వేడుకల్లో పాల్గొనడం ఒక గొప్ప గౌరవం… అరుదైన అవకాశంగా అభివర్ణించారు. శ్రీ సత్యబాబా మనుషుల్లో దేవుడిని చూశారు.. ప్రేమతో మనుషులను గెలిచాడు.తన సేవలతో దేవుడిగా పూజించబడుతున్నారు. ప్రేమతో ఏదైనా సాధించవచ్చని శ్రీ సత్యసాయిబాబా నిరూపించారు అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. శ్రీ సత్యసాయిబాబా మన మధ్య లేకపోయినా వారి స్ఫూర్తి మనందరిలో ఉంది.. మీ అందరిలో కనిపిస్తోంది. బాబా ప్రభుత్వాలతో పోటీ పడి కేజీ నుంచి పీజీ వరకూ పేదలకు ఉచితంగా విద్యనందించారు. పేదలకు ఉచిత వైద్యం అందించి దేవుడిగా కొలువబడుతున్నారు. గతంలో పాలమూరు జిల్లాలో బాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజలకు తాగునీటి కష్టాల నుంచి విముక్తి చేసి వారి దాహార్తిని తీర్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనే కాదు తమిళనాడు, కర్ణాటకతో పాటు ప్రపంచ వ్యాప్తంగా బాబా ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు.

మానవ సేవే మాధవ సేవ

మానవ సేవే మాధవ సేవ అని నమ్మి విద్య, వైద్యంతోపాటు ప్రజలకు మంచినీటి కష్టాలను దూరం చేసి వారి దాహార్తిని తీర్చారు. ప్రపంచంలో కోట్లాది మంది జీవితాలలో బాబా స్ఫూర్తి నింపారు. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో బాబా ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులు రావడం ఈ నేల పవిత్రతను తెలియజేస్తోంది. బాబా సేవలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశించాం…అని రేవంత్‌రెడ్డి అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి భర్త కిడ్నాప్‌..

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి భర్త కిడ్నాప్‌.. నామినేషన్‌ వేయకుండా కుట్ర న‌ల్ల‌గొండ‌లో మంత్రి కోమ‌టిరెడ్డి అనుచ‌రుల...

కోతి చేసిన పనికి కోట్ల నష్టం

కోతి చేసిన పనికి కోట్ల నష్టం కొండగట్టు అగ్ని ప్రమాదంలో 30 షాపులు...

సిండికేట్ దారులకే ఎక్సైజ్ శాఖ మొగ్గు

సిండికేట్ దారులకే ఎక్సైజ్ శాఖ మొగ్గు లక్కీ డ్రా లో మద్యం దుకాణాలు...

కాంగ్రెస్ నేత‌ల‌ది దోపిడీ ధ్యాసే

కాంగ్రెస్ నేత‌ల‌ది దోపిడీ ధ్యాసే రాష్ట్ర అభివృద్ధి ఆలోచ‌న చేయ‌డం లేదు మూసీ ప్రాజెక్టు...

బీసీ రిజర్వేషన్లు పొలిటికల్ డ్రామా..

బీసీ రిజర్వేషన్లు పొలిటికల్ డ్రామా.. ఆరు గ్యారంటీల అమ‌లులో ప్ర‌భుత్వం విఫ‌లం కేంద్రం నిధుల...

ఎరోస్పేస్‌, ఏవియేషన్‌ హబ్‌గా హైదరాబాద్‌

ఎరోస్పేస్‌, ఏవియేషన్‌ హబ్‌గా హైదరాబాద్‌ వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ విమానయాన రంగానికి సంబంధించి...

ఐబొమ్మ ర‌వికి 14 రోజుల రిమాండ్‌

ఐబొమ్మ ర‌వికి 14 రోజుల రిమాండ్‌ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: ఐబొమ్మ ప్రధాన...

మోగిన పంచాయతీ నగారా

మోగిన పంచాయతీ నగారా గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ 31 జిల్లాల్లో మూడు విడతల్లో ఎన్నిక‌లు డిసెంబర్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img