కాకతీయ,బయ్యారం: భారత తొలి తెలుగు విప్లవ వీరుడు, మొదటి బహుజన రాజ్య స్థాపకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఈ సందర్భంగా మండలంలో పలువురు నాయకులు,బీసీ నేతలు ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేళ సోమవారం బయ్యారం గౌడ సంఘ నాయకులు కత్తి రమేష్ గౌడ్ సర్దార్ పాపన్న చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన్నట్లు తెలిపారు.
ఈ సందర్బంగా కత్తి రమేష్ మాట్లాడుతు సామాజిక సమానత్వం, బహుజనులకు రాజ్యాధికారం కోసం అలుపెరుగని పోరాటం చేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మనందరికీ ఆదర్శమని కొనియాడారు. తన పోరాటాలతో గోల్కొండ నవాబులను గడ,గడ లాడించిన యోదుడని,పేదల పక్షపాతిగా, అన్యాయం పై అలుపెరుగని పోరాటం చేశాడని,పాలకులను గడగడలాడించిన మహనీయుడని అన్నారు.


