బాధిత కుటుంబానికి సర్పంచ్ చేయూత
కాకతీయ, తొర్రూరు : తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబ సభ్యుడు రాగి తిరుమల చారి ఇటీవల గుండెపోటుతో మృతిచెందారు. ఈ నేపథ్యంలో మంగళవారం అమ్మాపురం బీఆర్ఎస్ సర్పంచ్ ముద్దం సునీత వీరారెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.గ్రామంలో ఏ కుటుంబానికి ఆపద వచ్చినా అండగా నిలబడి సహాయ సహకారాలు అందిస్తామని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్తూరు రమేష్, పాక యాకయ్య, మార్క శ్రీనివాస్, బాధిత కుటుంబ సభ్యులు రాగి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


