ఎస్‌ఐని కలిసిన సర్పంచులు
కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని బోటిమీద తండాకు చెందిన నూతన సర్పంచి జాటోత్ రామ్‌సింగ్, వావిలాల సర్పంచ్ భర్త గోగుల ప్రశాంత్ యాదవ్, రాజ్య తండా సర్పంచి భర్త ఆనంద్‌లు స్థానిక ఎస్‌ఐ చిర్ర రమేష్‌బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐకి పుష్పగుచ్చం అందజేసి శాలువాలతో సన్మానించారు. అనంతరం ఎస్‌ఐ రమేష్‌బాబు మాట్లాడుతూ గ్రామాల్లో శాంతియుత వాతావరణం కొనసాగిస్తూ అభివృద్ధికి అందరూ కలిసి కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకువస్తామని సర్పంచులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ తవిశెట్టి రాకేష్ పాల్గొన్నారు.


