మంత్రి కొండా సురేఖను కలిసిన సర్పంచులు
గ్రామాభివృద్ధికి సహకరించాలని గీసుగొండ ప్రజాప్రతినిధుల వినతి
సానుకూల స్పందించిన మంత్రి సురేఖ
కాకతీయ, గీసుగొండ : రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను గీసుగొండ మండల సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కాంగ్రెస్ నాయకుడు, రాంపూర్ గ్రామ సర్పంచ్ రడం భరత్ కుమార్తో పాటు సూర్య తండ గ్రామ సర్పంచ్ రాఘవేంద్ర హైదరాబాద్ సెక్రటేరియట్లోని మినిస్టర్ ఛాంబర్లో మంత్రిని కలిసి తమ గ్రామాల్లో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై ప్రతిపాదనలు సమర్పించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల అభివృద్ధి, గ్రామీణ రహదారులు, తాగునీటి సరఫరా, పారిశుధ్యం వంటి అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత శాఖలతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.


