కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణి చేసిన సర్పంచ్ సంధ్య రమేష్
కాకతీయ, నెల్లికుదురు: మండలం లోని నైనాల గ్రామం లో నలుగురు కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు గ్రామ ఉపసర్పంచ్ పెరుమాండ్ల ఉపేందర్ గౌడ్ తో కలిసి సర్పంచ్ యాసం సంధ్య రమేష్ లబ్ధిదారులు ఆకుల రజిత, శివంగుల నాగమణి, దాసరి పద్మ, ఆకుల రాజమ్మ లకు పంపిణీ చేశారు. అంతకుమునుపు గొర్రెల మేకలు నట్టలు నివారణకు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు మా పై నమ్మకంతో సర్పంచిగా ఎన్నుకున్నందుకు గ్రామ సేవకులుగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యాసం రమేష్, వార్డ్ సభ్యులు యాసంవెంకటేశ్వర్లు,
ఆకుల వెంకటేష్,బొడ్డు విజయకుమార్, ఏర్పుల శృతి సరేష్, సీనియర్ నాయకులు చిర్ర శ్రీనివాస్,మాజీ ఎస్ఎంసి చైర్మన్ ఆవుల సాయిమల్లు, పంచాయతీ కార్యదర్శి అశోక్, యాదవ సొసైటీ అధ్యక్షులు ఆకుల మల్లేష్, కార్యదర్శి ఆవుల సాయిమల్లు,
జిపిఓ మురళి,కారోబార్ యకాలు, జి పి సిబ్బంది వెంకటమ్మ, మురళి తదితరులు పాల్గొన్నారు.


