కల్వర్టు పనులను ప్రారంభించిన సర్పంచ్ లక్ష్మీ
కాకతీయ, ఇనుగుర్తి : మండలంలోని లాలు తండా జిపిలో సర్పంచ్ లక్ష్మీ వెంకన్న నాయక్ ఆధ్వర్యంలో కొత్తగా కల్వర్టు పనులను సోమవారం ప్రారంభించారు. సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనులను త్వరతగా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా కల్వర్టు పనులను ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రజిత రాజు, వార్డు మెంబర్ మాలోతు రవి, భూక్య జీవన్, వీరన్న బానోతు దినేష్ తదితరులు పాల్గొన్నారు.


