సర్పంచ్ ఎన్నికలను సజావుగా నిర్వహించాలి
ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి
కాకతీయ, మరిపెడ : సర్పంచ్ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని మరిపెడ ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి రిటర్నింగ్ అధికారులకు సూచించారు. శుక్రవారం వరిపెడ ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలోమరిపెడ మండలంలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండల రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారులతో ఎన్నికల విధులు, ఓట్ల లెక్కింపు, పోలింగ్ కేంద్రాలనిర్వహణ, ఎన్నికల సామాగ్రి పంపిణీ, భద్రతఏర్పాట్ల పై శిక్షణనిచ్చారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు తప్పక పాటించాలన్నారు. ఎన్నికల నిబంధనలను ఎవరు ఉల్లంఘించిన శిక్ష హర్వులుఅవుతారన్నారు.ఎలాంటిఅవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న ప్రొసీడింగ్ అధికారులదే పూర్తి బాధ్యతన్నారు. పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. వికలాంగుల కొరకు ర్యాంపులు ఏర్పాటు చేయాలని తెలిపారు.ఈకార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి కిరణ్ కుమార్ , ఎంఈఓ అరుణాదేవి, మాస్టర్ ట్రైనర్ యాకయ్య,సిద్ధారెడ్డి, జోనల్ అధికారులు అవినాష్, హాథిరాం తదితరులుపాల్గొన్నారు.


