ఎంపీడీవో ను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్ దంపతులు
కాకతీయ, గణపురం: ఎంపీడీవో లంకపెల్లి భాస్కర్ ను సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ రాధిక శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ అభివృద్ధిలో తమకు సహాయ సహకారాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీడీవో లంకపెళ్లి భాస్కర్ సానుకూలంగా స్పందిస్తూ అభివృద్ధిలో కలిసికట్టుగా పనిచేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు, సేవలు అందించేందుకు తన వంతు సహకరిస్తానని అన్నారు.


