ప్రభుత్వ పాఠశాలల్లో సర్పంచ్ ఆకస్మిక తనిఖీ
ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ల పరిశీలన
మధ్యాహ్న భోజన పథకంపై ప్రత్యేక దృష్టి
కాకతీయ, గణపురం : గణపురం మండలం చెల్పూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లో గ్రామ సర్పంచ్ కావటి రచిత రవీందర్ శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యా ప్రమాణాలు, ప్రభుత్వ పథకాల అమలుపై నేరుగా పరిశీలన చేయాలనే ఉద్దేశంతో పాఠశాలలను సందర్శించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లను పరిశీలించిన సర్పంచ్, మధ్యాహ్న భోజన పథకం అమలును కూడా పరిశీలించారు. మిడ్డే మీల్స్ మెనూను గమనించి, విద్యార్థులకు పోషకాహారం కలిగిన నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. పిల్లల ఆరోగ్యం, విద్య రెండింటికీ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, అందుకు అనుగుణంగా బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పొనగంటి మలహాలు రావు, పంచాయతీ కార్యదర్శి ముక్కెర హేమంత్, వార్డు సభ్యులు గండ్రత్ రవీందర్, తీగల శ్రీకాంత్, పొనగంటి మౌనిక, అల్లూరి సారయ్య, కొండి కుమారస్వామి, మాజీ సర్పంచ్ కొత్త పద్మ వెంకటేశ్వర్లు, మాజీ సొసైటీ చైర్మన్ మాధవరావు, ఓనపాక రాజేంద్రప్రసాద్, దుప్పటి ప్రవీణ్, పొనగంటి సతీష్, రూపురెడ్డి రాజిరెడ్డి, నారమల్లె శంకర్, దారకొండ శంకర్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.


