సర్పంచ్ అభ్యర్థి గుండెపోటుతో ఆకస్మిక మృతి..!
కాకతీయ, వేములవాడ : వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణ గ్రామ సర్పంచ్ అభ్యర్థి చర్ల మురళి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. చింతల్ ఠాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఎంతో ఉత్సాహంగా గురువారం సైతం ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులకు ప్రజాసేవ చేసేందుకు
గ్రామాభివృద్ధికి మెరుగైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్న మురళి ఆకస్మిక మృతితో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.


