కాకతీయ, నెల్లికుదురు : భారత ఐక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రతీక అని ప్రభుత్వ జూనియర్ కళాశాల నెల్లికుదురు ఇన్చార్జి ప్రిన్సిపాల్ బండి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పటేల్ 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశాన్ని ఏకీకృతం చేయడం ద్వారా చరిత్ర మరువదన్నారు. 562 సంస్థానాలను భారత గణరాజ్యంలో విలీనం చేయడం ఆయన ధైర్యసాహసానికి ప్రతీకని కొనియాడారు. పటేల్ చూపిన మార్గాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ప్రకాష్ బాబు, కవిరాజు, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, సుధాకర్, బాబు, మహేందర్, యాకన్న, సతీష్, సుభాష్, అధ్యాపకేతర బృందం ప్రదీప్, లక్ష్మణ్, గౌరీ శంకర్, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు.


