టీపిటీఎల్ఏ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల సందడి
30 టీములతో పోటీలు.. విజేతలకు నగదు బహుమతులు
కాకతీయ, జమ్మికుంట : తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫోరం (టీపిటీఎల్ఏ) ఆధ్వర్యంలో జమ్మికుంటలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం స్థానిక ఆదిత్య వెంచర్‌లో జరిగిన ఈ పోటీల్లో వివిధ విద్యాసంస్థలకు చెందిన మహిళా ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం 30 టీములు పోటీపడగా, ఉత్తమ ముగ్గుల ఆధారంగా విజేతలను ఎంపిక చేశారు.
ప్రథమ బహుమతిని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల, ద్వితీయ బహుమతిని విద్యోదయ పాఠశాల, తృతీయ బహుమతిని ఎస్వి స్కూల్ ఉపాధ్యాయులు సాధించారు. విజేతలకు ట్రస్మా ప్రెసిడెంట్ డా. పుల్లూరి సంపత్ రావు చేతుల మీదుగా రూ.5,000, రూ.3,000, రూ.2,000 నగదు బహుమతులు అందజేశారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసిన టీపిటీఎల్ఏ అధ్యక్షులు రహమాన్ ఖాన్‌ను ఘనంగా సన్మానించారు. వివిధ విద్యాసంస్థల చైర్మన్లు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


