- సిద్దిపేట కలెక్టర్‌కు కేంద్ర మంత్రి బండి ఫోన్
కాకతీయ, కరీంనగర్ : హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం మల్లంపల్లి చెరువులో ఇద్దరు భార్యాభర్తలు గల్లంతైన ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. ఆయన గురువారం సాయంత్రం సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వివరాల ప్రకారం, గల్లంతైన వారిద్దరూ భార్యాభర్తలేనని, వారి బైక్ చెరువుకు సమీపంలో లభ్యమైందని కానీ వారి ఆచూకీ తెలియలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో వెంటనే ఎస్డీఆర్ఎఫ్ టీంలను పంపి గాలింపు చర్యలు వేగవంతం చేయాలని సంజయ్ సూచించారు. అన్ని రకాల సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి తెలిపారు.


