కాకతీయ, ములుగు: వర్షకాలంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ పల్లెలలో పారిశుద్ద్యం పై ప్రత్యేక దృష్టి సారించి పల్లెలలోని ప్రజలు సీజనల్ వ్యాదుల భారీన పడకుండా చర్యలు తీసుకోవాలసిన గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం కారణంగా ప్రజలు వ్యాదుల భారీన పడి ఆసుపత్రులకు పరుగులు పెడుతున్న పరిస్థితి రోజురోజుకు పెరుగుతుంది. గ్రామాన్ని పారిశుద్యం బాటలో నడిపించవలసిన అధికారులు తమ కంటి ముందే కుప్పలు, తెప్పలుగా చెత్త పెరుకుపోతున్న పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాలలో గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదికారులు పారిశుద్ద్యం పై దృష్టి సారించకపోవడంతో ఏక్కడి చెత్త అక్కడ కుప్పలుగా పెరుగుతున్నాయి. గ్రామంలోని డ్రైనైజీ కాలువలలో మురుగు నీరు నిలిచి పోయి దుర్ఘందం వెదజల్లుతుంది. గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనడానికి నిదర్శనంగా మండలంలోని ఒక పంచాయతీ కార్యదర్శి అధికారి ఇంటి ముందు, అ గల్లీ లో పెరుకుపోయిన చెత్త సాక్ష్యంగా కనిపిస్తుంది. రోజు అదే దారిలో వెళ్లె అ పంచాయతీ శాఖ అధికారి పారిశుద్ద్యం పై దృష్టి సారించకపోవడం మరీ గమనార్హం..
గ్రామాలలో ఫాగింగ్ కరువు..ప్రభలుతున్న సీజనల్ వ్యాధులు..
మండలంలో పారశుద్ద్యం పడకేయడంతో ప్రజలు వ్యాదుల భారీన పడుతున్నారు. ఏజెన్సీ గ్రామాలలో గడిచిన 15 రోజుల వ్యవదిలోనే విష జ్వరాల భారీన పడిన వారి సంఖ్య వీపరితంగా పెరిగినట్టు సమాచారం. ఇదీలా ఉండగా గ్రామంలో దోమల నియంత్రణ, మురుగు కాలువల దుర్ఘంద నియంత్రణ వంటి అంశాల పై ప్రత్యేక దృష్టి సారించి ఫాగింగ్, బ్లీచింగ్ వంటివి చేయాలిసిన గ్రామ పంచాయతీ అధికారులు అ వైపు దృష్ట సారించడం లేదు ఫలితంగా మండలంలోని గ్రామాలలో దోమలు స్వైర విహరం చేస్తూ ఇళ్లలో తాండవం చేస్తుండడంతో ప్రజలు ఇళ్లలో కూడా నిలబడలేని పరిస్థితి నెలకొంటుంది.
పర్యటన సమయంలోనే పారిశుద్ద్యం..
గ్రామ పంచాయతీ అధికారులు తమ పారశుద్ద్య ప్రదర్శన ఉన్నత అధికారుల, మంత్రుల పర్యటనల సమయంలో కనబరుస్తున్నట్లు తెలుస్తుంది. రాజకీయ నాయకుల, పలు శాఖ ఉన్నతాదికారుల పర్యటన సందర్బంలోనే గ్రామ పంచాయతీ అధికారులు పారిశుద్ద్యం పై ఒక్క రోజు పారిశుద్ద్యం అన్న తీరున అఘామేఘాల మీద పనులు కానిచ్చేస్తున్నారు. పర్యటనల అనంతరం మళ్లీ పారిశుద్ద్యం పడే కేసి షరా మామూలుగానే కొనసాగుతుంది. మరీ ఇప్పటికైన గ్రామ పంచాయతీ అధికారులు పల్లెలలో పారిశుద్ద్యం పై దృష్టి సారించి ప్రజలు వ్యాదుల భారీన పడకుండా కాపాడతారో లేదో వేచి చూడాలి..


