- సస్పెండ్ చేస్తూ ఎస్పీ పరితోష్ పంకజ్ ఉత్తర్వులు
- ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారణమని విచారణలో వెల్లడి!
కాకతీయ, తెలంగాణ బ్యూరో : సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై రవీందర్ సస్పెండయ్యారు. ఓ కేసు విచారణలో లంచం డిమాండ్ చేసి వేధింపులకు గురిచేసిన ఆరోపణలపై ఎస్సై రవీందర్‌పై వేటుపడింది. ఎస్సై వేధింపులతోనే లోకేష్.. అనే వ్యక్తి మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో తేలింది. బాధితుడి భార్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎస్పీ పరితోష్ పంకజ్ విచారణ జరిపారు. ఈమేరకు మల్టిజోన్ 2 ఐజీ ఆదేశాలతో ఎస్సైపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.


