కాకతీయ, తెలంగాణ బ్యూరో: టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు. రూ. 10లక్షల విరాళాన్ని సీఎం సహాయనిధికి అందించారు సందీప్ రెడ్డి వంగా. శుక్రవారం జూబ్లిహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందించారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో ఎంతో మంది నష్టపోయారు. నష్టపోయిన వారిని ఆదుకునేందుకు తన వంతు సహాయం అందించినట్లు తెలుస్తోంది.


