epaper
Sunday, March 1, 2026
epaper

ఇసుక దొంగ‌లు

ఇసుక దొంగ‌లు

శంకరపట్నం మండలంలో ఇష్టారాజ్యంగా దందా
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమ ర‌వాణా
ఉదయం 4 గంటల నుంచే తరలింపు
నిత్యం 200కుపైగా ట్రాక్టర్లలో తరలుతున్న వైనం
మైనర్లే డ్రైవర్లు.. సిండికేట్‌గా మాఫియా
నిద్రావ‌స్థ‌లో రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖలు

కాకతీయ, శంకరపట్నం : మండలంలో ఇసుక అక్రమ దందా రోజురోజుకూ రెచ్చిపోతూ బహిరంగ సిండికేట్ వ్యవస్థగా మారింది. కొంతమంది వ్యక్తులు చేతులు కలిపి ఏర్పాటు చేసిన సిండికేట్, ప్రభుత్వ ఇందీరమ్మ ఇండ్ల పేరును కవచంగా చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తవ్వి తరలిస్తూ లక్షలు కొల్లగొడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యమే ఈ దందాకు ప్రధాన బలమైందనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. వీణవంక మండల పరిధిలోని చల్లూరు ఇసుక రీచ్‌ నుంచి ఈ అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం. తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమయ్యే తవ్వకాలు ఉదయం 9 గంటల వరకు నిరవధికంగా కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమని చెప్పుకుంటూ ట్రాక్టర్లలో ఇసుకను తరలించడం నిత్యకృత్యంగా మారిందని ఆరోపిస్తున్నారు. నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘిస్తూ సాగుతున్న ఈ దందా వెనుక ఎవరి అండ ఉందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. రోజువారీగా భారీ ఎత్తున ఇసుక తరలింపులు జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖల నుంచి ఎలాంటి కట్టడి చర్యలు కనిపించకపోవడం ఇసుక మాఫియాకు అధికారుల అండదండలు మెండుగా ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మైనర్లతో డ్రైవింగ్…

శంకరపట్నం మండలంలో ఇసుక రవాణాలో నిబంధనలు పూర్తిగా కనుమరుగైన పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 4 గంటలకే ప్రారంభమయ్యే ఈ అక్రమ ర‌వాణా చల్లూరు ఇసుక రీచ్‌కే పరిమితం కాకుండా మండల పరిధిలోని నదుల నుంచి కూడా యథేచ్ఛగా తవ్వి తరలిస్తున్నట్లు సమాచారం. ప్రతిరోజూ 200 నుంచి 300 వరకు ట్రాక్టర్లలో భారీ ఎత్తున ఇసుక తరలింపు జరుగుతుండటం అధికార యంత్రాంగం వైఫల్యాన్ని స్పష్టంగా వెల్లడిస్తున్నదని స్థానికులు విమర్శిస్తున్నారు. అక్రమ రవాణాను గుర్తించకుండా ఉండేందుకు ట్రాక్టర్లపై నెంబర్ ప్లేట్లు లేకుండా లేదా నెంబర్‌లు స్పష్టంగా కనిపించని విధంగా ఏర్పాటు చేసుకోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా, ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను అధిక శాతం మైనర్ బాలురే నడుపుతున్నారనే విషయం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. చట్టాలను బహిరంగంగా ఉల్లంఘిస్తూ సాగుతున్న ఈ దందా ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నప్పటికీ సంబంధిత శాఖల నుంచి ఎలాంటి కట్టడి చర్యలు కనిపించకపోవడం విమర్శలకు కారణమవుతోంది.

మామూళ్ల మత్తులో అధికారులు!

శంకరపట్నం మండలంలో నిత్యం వందలాది ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుక బహిరంగంగా తరలుతున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడం తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కళ్లముందే దందా సాగుతున్నా నామమాత్రపు కేసులతో సరిపెట్టడం వెనుక కారణాలపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక సిండికేట్ నుంచి నెలవారీగా అందుతున్న మామూళ్లే అధికారుల మౌనానికి కారణమన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అక్రమ దందాను అడ్డుకోవాల్సిన బాధ్యత ఉన్న అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఇసుక మాఫియా మరింత రెచ్చిపోతుందన్న ఆగ్రహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. వెంటనే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img