కాకతీయ, బయ్యారం : బయ్యారం పోలీస్ స్టేషన్ లో ఉన్న పట్టివేతకు గురి అయిన ఒక ట్రక్కు ఇసుకను వేలం ద్వారా విక్రయించునున్నారనని మండల తహశీల్దార్ నాగరాజు తెలిపారు. ఈసందర్భంగా ఈ నెల 13న ఉదయం 11గంటలకు వేలం నిర్వహిస్తారని, ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొనవచ్చునని శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ఇసుక వేలం పాటపాడిన వారు వెంటనే వేలం మొత్తం సొమ్మును చలానా రూపంలో చెల్లించాలని, ఇసుక మండల పరిధి దాటి పోరాదని, ఇసుక మండల గిర్దావర్ పర్యవేక్షణ లో ఉంటుందని, సరియైన మూల్యం రాకపోతే సర్కారు వారికి వేలం రద్దు చేసే అధికారం కలదని తెలిపారు. అన్ని విషయాలలో తుది నిర్ణయం తహసీల్దార్ కు ఉంటుందని, ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొనాలని ఆయన పేర్కొన్నారు.


