కాకతీయ, హనుమకొండ : తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు శివరాత్రి అయిలుమల్లు ఆధ్వర్యంలో వడ్డెర సంఘం కీలక నియామకాలు చేపట్టారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా గండికోట సంపత్ నియమితులయ్యారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్లుగా పల్లపు మల్లికార్జున్, నాగరాజు బాధ్యతలు స్వీకరించారు.
కాజీపేట అర్బన్ అధ్యక్షుడిగా కంది శ్రీనివాస్, కాజీపేట మండల యూత్ ప్రెసిడెంటుగా పల్లపు నవీన్ బాధ్యతలు చేపట్టారు. రాంపూర్ గ్రామ అధ్యక్షుడిగా పల్లపు సమ్మయ్య నియమితులయ్యారు. కార్యక్రమంలో వడ్డెర సంఘం పలువురు నాయకులు పాల్గొని, కొత్తగా నియమితులైన నేతలకు శుభాకాంక్షలు తెలిపారు.


