epaper
Wednesday, March 11, 2026
epaper

ఆర్‌ఎస్ ప్రవీణ్‌కు సజ్జనార్ లీగల్ నోటీసులు

ఆర్‌ఎస్ ప్రవీణ్‌కు సజ్జనార్ లీగల్ నోటీసులు
అవాస్తవ ఆరోపణలపై వివరణ కోరిన సిట్ చీఫ్
పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలపై అభ్యంతరం
ఏడు కేసుల వివరాలు ఇవ్వాలని డిమాండ్
రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని గడువు
లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు తప్పవంటూ హెచ్చ‌రిక‌

కాకతీయ, హైదరాబాద్ : మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత *ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్*కు లీగల్ నోటీసులు జారీ చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌, ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్‌ అధిపతి వి.సి. సజ్జనార్ తెలిపారు. తనపై ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పేర్కొంటూ, వాటిపై రెండు రోజుల్లోగా రాతపూర్వక వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ప్రవీణ్ కుమార్ ఇటీవల మీడియా సమావేశంలో సజ్జనార్‌పై గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ఏడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, అలాంటి వ్యక్తికి ఫోన్ ట్యాపింగ్ కేసును విచారించే అర్హత లేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు తన వ్యక్తిగత ప్రతిష్ఠకు తీవ్ర భంగం కలిగించేవిగా ఉన్నాయని సజ్జనార్ నోటీసుల్లో పేర్కొన్నారు.

కేసుల వివరాలు ఇవ్వాలని డిమాండ్

తనపై ఉన్నాయని చెబుతున్న ఏడు కేసులకు సంబంధించి క్రైమ్ నంబర్లు, సంబంధిత పోలీస్ స్టేషన్‌లు, వర్తించే సెక్షన్లు తదితర పూర్తి వివరాలతో పాటు డాక్యుమెంటరీ ఆధారాలను సమర్పించాలని సజ్జనార్ డిమాండ్ చేశారు. నిరాధార ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇది చట్టపరంగా నేరమని ఆయన స్పష్టం చేశారు. నోటీసు అందిన రెండు రోజుల్లోగా సరైన ఆధారాలతో వివరణ ఇవ్వకపోతే, తనకు ఉన్న చట్టబద్ధ హక్కులను వినియోగించుకుని సివిల్‌తో పాటు క్రిమినల్ చర్యలు (పరువు నష్టం కేసులు సహా) తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. అంతేకాదు, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కూడా నోటీసుల్లో పేర్కొన్నారు.

రాజకీయ వర్గాల్లో చర్చ

ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఐపీఎస్ నేపథ్యం ఉన్న ఇద్దరు నేతల మధ్య నోటీసుల వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్‌, హరీశ్ రావుల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నోటీసులు మరింత ఆసక్తికరంగా మారాయి. సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా, చట్టప్రకారమే సాగుతోందని సజ్జనార్ స్పష్టం చేస్తూ, తప్పుడు ఆరోపణలతో దర్యాప్తును మళ్లించేందుకు చేసే ప్రయత్నాలను సహించబోమని సంకేతాలు ఇచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కేంద్ర నిధులు దయ కాదు.. తెలంగాణ హక్కు

కేంద్ర నిధులు దయ కాదు.. తెలంగాణ హక్కు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను...

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఎస్ఐలు

ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఎస్ఐలు ఏసీబీ వలలో ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసుల...

మహిళల రక్షణ సామాజిక‌ బాధ్యత

మహిళల రక్షణ సామాజిక‌ బాధ్యత యువత మహిళా రక్షణకు బ్రాండ్ అంబాసిడర్...

జీహెచ్‌ఎంసీలో క‌మిష‌న‌ర్ ఆక‌స్మిక త‌నిఖీలు

జీహెచ్‌ఎంసీలో క‌మిష‌న‌ర్ ఆక‌స్మిక త‌నిఖీలు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా క్షేత్రస్థాయి పర్యటన బంజారాహిల్స్‌,...

ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ అధికారి

ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ అధికారి పింఛన్ ప్రాసెస్ కోసం డబ్బులు డిమాండ్ రూ.35 వేల...

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు చిన్నారి మరణానికి కారణమైన వారిపై...

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి డీజీపీకి వినతిపత్రం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img