epaper
Tuesday, January 20, 2026
epaper

ఆట‌కు వీడ్కోలు ప‌లికిన సైనా నెహ్వాల్

ఆట‌కు వీడ్కోలు ప‌లికిన సైనా నెహ్వాల్

కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ : భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆటకు వీడ్కోలు పలికింది. గత రెండేళ్లుగా ఆటకు దూరంగా ఉన్న ఈ హైదరాబాద్ స్టార్.. తన రిటైర్మెంట్ విషయాన్ని ఖరారు చేసింది. మోకాళ్ల సమస్యే తన వీడ్కోలు నిర్ణయానికి ప్రధాన కారణమని తెలిపింది. రిటైరవుతున్నట్లు లాంఛనంగా ప్రకటించడం అవసరమని తాను భావించలేదని పేర్కొంది. భారత మహిళల బ్యాడ్మింటన్‌లో ఎన్నో అత్యుత్తమ విజయాలు సాధించి మార్గదర్శిగా నిలిచిన సైనా నెహ్వా.. ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తన నిర్ణయాన్ని వెల్లడించింది. ‘రెండేళ్ల కిందటే నేను ఆడటం మానేశా. నా అంతట నేను ఆటలోకి వచ్చా.. నా అంతట నేను నిష్క్రమిస్తున్నా. అందుకే ప్రత్యేకంగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు చెప్పడం అవసరం లేదనుకున్నా. ఇంకెంత మాత్రం ఆడగలిగే సామర్థ్యం లేనప్పుడు కథ ముగిసనట్లే. మరేం పర్వాలేదు’అని సైనా చెప్పుకొచ్చింది. చైనా ఆధిపత్యానికి గండి కొట్టి అత్యున్నత శిఖరాలకు చేరిన సైనా.. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌గా చరిత్ర సృష్టించింది.

గాయాలతో ఆట‌కు దూరం

2008లో జూనియర్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి తన సత్తాను ప్రపంచానికి చాటిన సైనా.. 2009లో బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్‌గా రికార్డ్ సాధించింది. ఇండోనేసియా, సింగపూర్, స్విస్ ఓపెన్లలోనూ విజేతగా నిలిచింది. సైనా కెరీర్‌లో 10 సూపర్ సిరీస్, 10 గ్రాండ్‌ప్రి టైటిళ్లు ఉన్నాయి. 2014లో ఆసియా క్రీడల్లో కాంస్యం, 2015లో ప్రపంచ ఛాంపియన్‌షిప్, ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. అదే ఏడాది వరల్డ్ నెంబర్ వన్ ర్యాంక్ అందుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా ప్లేయర్‌గా నిలిచింది. 2017 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన సైనా.. 2018 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం అందుకుంది. సైనాను కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డ్(2009), ఖేల్ రత్న(2010) అవార్డులతో సత్కరించింది. 2023లో చివరగా సైనా కోర్టులో కనిపించింది. ఆ తర్వాత గాయాలతో ఆటకు దూరమైంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్

విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్ ఏ ప్ల‌స్‌ గ్రేడ్​ రద్దు బీ కేటగిరీలోకి...

గంభీర్ శిక్ష‌ణ‌కు ప‌రీక్ష‌

గంభీర్ శిక్ష‌ణ‌కు ప‌రీక్ష‌ టీమ్ఇండియాకు 5 చేదు జ్ఞాపకాలు ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తున్న చెత్త రికార్డులు...

బంగ్లాదేశ్‌కు డెడ్‌లైన్‌

బంగ్లాదేశ్‌కు డెడ్‌లైన్‌ ఈనెల 21లోపు తుది నిర్ణయాన్ని తెల‌పాలి లేదంటే ప్రత్యామ్నాయాలు ఉన్నాయ్ ఐసీసీ...

చరిత్ర సృష్టించిన వీనస్ విలియమ్స్..

చరిత్ర సృష్టించిన వీనస్ విలియమ్స్.. 45 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్...

గంభీర్.. నీకో దండం!

గంభీర్.. నీకో దండం! టీమిండియాను వదిలేయ్! భార‌త్ క్రికెట్ కోచ్‌పై ఫ్యాన్స్ ఫైర్ హెడ్ కోచ్...

ఫామ్​లోనే రోహిత్

ఫామ్​లోనే రోహిత్ ఒక్క సిరీస్ ప్రదర్శన ఆధారంగా విమ‌ర్శించ‌డం త‌గ‌దు హిట్​మ్యాన్​కు ​గిల్ మద్దతు కాక‌తీయ‌,...

ఫీల్డింగే ముంచింది

ఫీల్డింగే ముంచింది మిడిల్ ఓవర్లలో ఫీల్డర్ల ఉదాసీనత చాలా తేలికగా సింగిల్స్ ఇచ్చేశారు బౌలర్లు సృష్టించిన...

తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డి‌పై వేటు

తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డి‌పై వేటు ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారత జట్టు కాక‌తీయ‌,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img