epaper
Sunday, March 1, 2026
epaper

తెలంగాణలో హిందువుల భద్రత ప్రశ్నార్థకం

తెలంగాణలో హిందువుల భద్రత ప్రశ్నార్థకం
దేవాలయాలపై దాడులు యాదృచ్ఛికం కావు
కాంగ్రెస్ పాలనలో ‘అప్పీజ్‌మెంట్’ రాజకీయాలు
మల్కాజ్‌గిరి ఘటన హిందూ విశ్వాసంపై దాడి
హిందువుల తరఫున గట్టిగా మాట్లాడేది బీజేపీయే
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రాంచందర్ రావు
ఆలయాల రక్షణకు సాంస్కృతిక పోరాటం తప్పదని హెచ్చరిక

కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో హిందువుల పరిస్థితి రోజు రోజుకీ ఆందోళనకరంగా మారుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రాంచందర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులు, గౌ రక్షకులపై హింస యాదృచ్ఛిక ఘటనలు కావని, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి, ఓటు బ్యాంకు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. హిందూ విశ్వాసాల పరిరక్షణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో దాదాపు ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, గౌ రక్షకులపై హింస పెరుగుతోందని రాంచందర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి విడివిడిగా జరిగిన సంఘటనలు కావని, హిందువుల భద్రత విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయని అన్నారు. ఇది ఒక సాధారణ పరిస్థితి కాదని, కాంగ్రెస్ అసలు స్వరూపాన్ని బయటపెట్టే ప్రమాదకరమైన ‘ప్యాటర్న్’గా అభివర్ణించారు.

మల్కాజ్‌గిరి ఘటన.. హిందూ విశ్వాసానికి అవమానం

గత రాత్రి మల్కాజ్‌గిరిలో చోటుచేసుకున్న ఘటన హిందూ విశ్వాసంపై జరిగిన ఘోరమైన దాడిగా ఆయన పేర్కొన్నారు. పవిత్రమైన కట్టమైసమ్మ ఆలయ ప్రాంగణంలో ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసి ఆలయాన్ని అపవిత్రం చేయడం అత్యంత ఖండనీయమన్నారు. ఇది చిన్న ఘటన కాదని, హిందూ సమాజాన్ని అవమానపరిచే చర్యగా అభివర్ణించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడం, బీఆర్ఎస్ నేతలు మౌనం పాటించడం, ప్రధాన మీడియా కూడా స్పందించకపోవడం తీవ్రంగా కలచివేసిందని రాంచందర్ రావు అన్నారు. ఈ మౌనం తెలంగాణలో హిందువులపై ఏం జరిగినా వ్యవస్థ పట్టించుకోదన్న కఠిన నిజాన్ని స్పష్టం చేస్తోందని వ్యాఖ్యానించారు.

హిందువుల తరఫున బీజేపీ మాత్రమే పోరాటం

హిందువుల భావోద్వేగాలకు, విశ్వాసాలకు, ఆధ్యాత్మికతకు నేటి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి గౌరవం లేదని రాంచందర్ రావు ఆరోపించారు. నేటి కాంగ్రెస్ పార్టీ ఆత్మలోనూ, ఆలోచనలోనూ, ప్రవర్తనలోనూ ముస్లిం లీగ్–మావోయిస్టు సానుకూల కాంగ్రెస్‌గా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందూ సమాజం పట్ల ఇతర పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితమయ్యాయని, స్పష్టంగా, ధైర్యంగా హిందువుల తరఫున గొంతెత్తేది భారతీయ జనతా పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ మౌన ప్రేక్షకులుగా ఉండబోదని, హిందూ విశ్వాసంపై దాడులు జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని రాంచందర్ రావు హెచ్చరించారు. ఆలయాల రక్షణ కోసం, హిందువుల గౌరవ పరిరక్షణ కోసం, గౌమాత రక్షణ కోసం బీజేపీ పోరాడుతుందని ప్రకటించారు. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం చేసే పోరాటం కాదని, హిందూ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం సాగించే సాంస్కృతిక పోరాటమని ఆయన స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు చిన్నారి మరణానికి కారణమైన వారిపై...

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి డీజీపీకి వినతిపత్రం...

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం జీవో 252 ప్రకారం అమలు…...

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ రూ.50 వేలు డిమాండ్‌… ఏసీబీ ట్రాప్‌లో...

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలి 8,203 పోలింగ్ కేంద్రాల్లో భద్రత...

ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం

ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం ఎన్‌సీసీ సేవలను ప్రశంసించిన జిష్ణు దేవ్...

బ్యాక్‌డోర్ ఉద్యోగాల కుట్ర!

బ్యాక్‌డోర్ ఉద్యోగాల కుట్ర! దొడ్డిదారిన నియామకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నం నిరుద్యోగుల నోట్లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img