సురక్షిత ప్రయాణమే లక్ష్యం
డీఎస్పీ కృష్ణకిషోర్
100 హెల్మెంట్ లను పంపిణీ
కాకతీయ, పెద్దవంగర: రోడ్డు ప్రమాదాలను తగ్గించి సురక్షిత ప్రయాణాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ’అరైవ్- అలైవ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని డీఎస్పీ కృష్ణకిషోర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ద్విచక్ర వాహనదారులకు 100 హెల్మెంట్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు. కార్యక్రమంలో సీఐ గణేష్ , ఎస్‌ఐ ప్రమోద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముద్దసాని సురేష్, దాతలు చిన్నవంగర సర్పంచ్ మహేందర్, పరమేష్, మురళి గౌడ్, శంకర్, ఉప సర్పంచ్ వినోద్, వార్డు సభ్యులు, సిబ్బంది సుధాకర్, అనిత, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.


