కాకతీయ, బయ్యారం: మండలంలోని ఉప్పలపాడు గ్రామ పంచాయతీ జనార్ధనపురం గ్రామానికి చెందిన రుద్ర సేవా సమితి, రుద్ర ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో పలు సేవ కార్యక్రమాలు మండల వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
శుక్రవారం మండలంలోని జనార్ధన పురం గ్రామానికి చెందిన సింగు పూలమ్మ ఆర్ధిక పరమైన సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న ,రుద్ర సేవా సమితి, రుద్ర ఫ్రెండ్స్ యూత్ తరుపున ఆ కుటుంబానికి చేయూతనందిస్తూ వారి కుటుంబానికి 50 కేజీల బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, సేవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


