బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా రుద్ర ప్రదీప్ నియామకం
కాకతీయ, ఖమ్మం : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు ఆదేశానుసారం రుద్ర ప్రదీప్ ను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా రుద్ర ప్రదీప్ మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి , జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు రాష్ట్ర నాయకులకు,జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది . తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కోసం నిరంతరం పని చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలియచేశారు.


